logo
జాతీయం

బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. ఆవులను చంపితే.. మీరూ చస్తారు..!

బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. ఆవులను చంపితే.. మీరూ చస్తారు..!
X
Highlights

రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గోవులను అక్రమ రవాణా చేసేవారికి, గో ...

రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గోవులను అక్రమ రవాణా చేసేవారికి, గో మాంసం తినేవారికి చావే గతి అని, ఆవులను చంపితే.. మీరు కూడా చస్తారు అంటూ హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే..రాజస్థాన్‌లో గత శనివారం ఆవుల అక్రమ రవాణాకు యత్నించిన జకీర్‌ ఖాన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జకీర్‌ నడుపుతున్న ట్రక్కును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా అతడు బారికేడ్లను ఢీకొట్టి పారిపోయాడు. విషయం తెలిసిన స్థానికులు జకీర్‌ ట్రక్కును అడ్డగించి అతడిపై దాడి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై భాజపా శాసనసభ సభ్యుడు జ్ఞాన్‌దేవ్‌ అహుజా స్పందించారు. ‘ఆవు మనకు అమ్మ. ఆవులను అక్రమంగా తరలించినా.. వాటిని చంపినా.. వారు కూడా హత్యకు గురవుతారు’ అని అహుజా హెచ్చరించారు. ఈ ఘటనలో నిందితుడు జకీర్‌పై స్థానికులు దాడి చేయలేదని.. పారిపోతుండగా ట్రక్కు బోల్తా పడి అతడు గాయపడినట్లు చెప్పారు.

Next Story