టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్, వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ సహనం కోల్పోయాడు. టీమిండియా రెండో టెస్ట్ ఓటమి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా...
టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్, వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ సహనం కోల్పోయాడు. టీమిండియా రెండో టెస్ట్ ఓటమి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై స్పందిస్తూ.. కాస్త ఘాటైన కామెంట్సే చేశాడు. టీమ్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే తన ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన పాండ్యాను.. చాలా మంది కపిల్‌దేవ్‌తో పోల్చుతున్న విషయం తెలిసిందే. గతంలో దీనిని స్వాగతించిన కపిల్.. ఈసారి మాత్రం అసహనం వ్యక్తంచేశాడు.
తాను ఏ మ‍్యాచ్ ఆడినా సీరియస్‌గా ఆడేవాడినని, సిల్లీ తప్పిదం చేసిన హార్దిక్‌ను తనతో పోల్చవద్దంటూ కపిల్ చురకలంటించాడు.' హార్దిక్‌లో చాలా టాలెంట్ ఉంది. ఇది కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో చూశాం. అయితే అతను మానసికంగా చాలా పరిపక్వత సాధించాల్సి ఉంది. రెండో టెస్టులో మాత్రం హార్దిక్ చాలా సిల్లీగా రనౌటయ్యాడు. ఆ తరహా తప్పిదాలు చేస్తున్నట్లయితే హార్దిక్‌తో నన్ను పోల్చకండి. అతను గేమ్‌ను సిరీయస్‌గా తీసుకోలేకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తరహాలో రనౌటైన హార్దిక్‌కు నాతో పోలిక సరికాదు' అని కపిల్ విమర్శించాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire