logo

ఈ బదిలీల వెనుక ఏముంది?

ఈ బదిలీల వెనుక ఏముంది?
Highlights

అధికార పార్టీ ఎమ్మెల్యేల తప్పుల్ని ఎత్తిచూపిన జనగామ కలెక్టర్‌ దేవసేన, మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతిమీనాకు...

అధికార పార్టీ ఎమ్మెల్యేల తప్పుల్ని ఎత్తిచూపిన జనగామ కలెక్టర్‌ దేవసేన, మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతిమీనాకు ప్రభుత్వం షాకిచ్చింది. దేవసేనను పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమించి కొంతలో కొంత ఊరటనిచ్చినా‌ మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతిమీనాను మాత్రం ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సంచాలకురాలిగా ట్రాన్స్‌ఫర్‌ చేసి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. ఇక పాలనా యంత్రాంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దఎత్తున ఐఏఎస్‌‌లను బదిలీ చేశారు. ము‌ఖ్యంగా పదేపదే వివాదాలకు కారణమవుతున్న ఐఏఎస్‌‌లపై బదిలీ వేటేసి పరోక్షంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకే తన మద్దతు తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి ఏకంగా 30మందికి పైగా ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించింది.
రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా
ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీఆర్ మీనా
రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి
పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్
కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా నవీన్ మిత్తల్
విపత్తు నిర్వహణ కమిషనర్‌గా ఆర్.వి.చంద్రవదన్
బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా అనితా రాజేంద్ర
గిరిజిన సంక్షేమ కమిషనర్‌గా క్రిస్టినా
ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్దప్రకాశ్
భూ పరిపాలన సంచాలకులుగా వాకాటీ కరుణ‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అలాగే పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా
రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి
సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్
ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా శివకుమార్ నాయుడు
ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అశోక్‌కుమార్
ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్‌డీగా కాళీచరణ్
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా భారతి హోళికేరి
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా సిక్బా పట్నాయక్
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ముషారఫ్ అలీ
బోధన్ సంయుక్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
మెట్‌పల్లి సంయుక్త కలెక్టర్‌గా గౌతమ్
భద్రాచలం సంయుక్త కలెక్టర్‌గా పమేలా సత్పతి
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఒమర్ జలీల్
నిజామాబాద్ కలెక్టర్‌గా ఎం.ఆర్.ఎం.రావు
బెల్లంపల్లి సంయుక్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్‌ను నియమించింది.
ఇక వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి...
బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశానికి...
మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్‌కు....
జనగాం కలెక్టర్‌గా అనితా రామచంద్రన్‌కు....
మహబూబాబాద్ కలెక్టర్‌గా లోకేశ్ కుమార్‌కు....
మెదక్ కలెక్టర్‌గా మాణిక్‌రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించింది
అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసొచ్చేలా బదిలీల ద్వారా ప్రభుత్వం సంకేతాలిచ్చిందంటున్నారు. అంతేకాదు ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధుల పోరులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌‌దే పైచేయి అయ్యిందంటూ నెటిజన్లు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు.


లైవ్ టీవి


Share it
Top