పార్టీ వీడటంపై స్పందించిన వైసీపీ నేత

పార్టీ వీడటంపై స్పందించిన వైసీపీ నేత
x
Highlights

వైసీపీ నేత నవీన్ నిశ్చల్ పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. హిందూపురం ఆర్‌ఎంఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో మైనార్టీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి మైనార్టీలు...

వైసీపీ నేత నవీన్ నిశ్చల్ పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. హిందూపురం ఆర్‌ఎంఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో మైనార్టీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి మైనార్టీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్‌నిశ్చల్‌ మాట్లాడుతూ.. 'ఐదేళ్లుగా పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి నియోజకవర్గంలో ఎంతో బలోపేతం చేశానని.. అలాంటి పార్టీని వీడే ప్రసక్తే లేద'ని నవీన్‌నిశ్చల్‌ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. కాగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను నియోజకవర్గ ఇంచార్జ్ గా జగన్ నియమించారు. అయితే ఈ పరిణామం నవీన్ నిశ్చల్ కు రుచించలేదు. 2014 ఎన్నికల్లో హిందూపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓటమి చెందారు నవీన్. అప్పటినుంచి హిందూపురం వైసీపీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే హఠాత్తుగా అబ్దుల్ గని చేరడంతో నవీన్ భవితవ్యం ప్రస్నార్ధకం అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories