కేసిఆర్ కోసం హైదరాబాద్ వస్తా: అఖిలేష్

కేసిఆర్ కోసం హైదరాబాద్ వస్తా: అఖిలేష్
x
Highlights

కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వడివడి అడుగులు వెస్తున్నా విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నేడు బుధవారం సమాజ్...

కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వడివడి అడుగులు వెస్తున్నా విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నేడు బుధవారం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తో సమావేశం జరగాల్సిఉండే అయితే నేటి సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల జనవరి 7 తరువాత తప్పకుండా హైదరాబాద్‌లోనే సిఎం కెసిఆర్‌ను కలుస్తానని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. వాస్తవానికి ఈనెల 25,26తేదీల్లో కెసిఆర్‌ను కలవాల్సి ఉండే కాకపోతే కొన్ని కారణాల వల్ల కలువలేకపోయానని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇటివల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి, అధికార పగ్గాలు చేపట్టిన కెసిఆర్ అనంతరం అన్ని జాతీయపార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని అందుకు నా కెసిఆర్ కు అభినందనీయం అని పెర్కోన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై కెసిఆర్ తో మరింత చర్చిస్తానని అఖిలేశ్ అన్నారు. ఫెడరల్ పై త్వరలోనే సిఎం కెసిఆర్ ను హైదరాబాద్ లోనే మంతనాలు జరుపుతానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories