Top
logo

కాంగ్రెస్ ను వీడటంపై స్పందించిన లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ ను వీడటంపై స్పందించిన లక్ష్మారెడ్డి
X
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలు బలాబలాలు చూసుకుని నేతలకు ఎర వేస్తున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ కు...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలు బలాబలాలు చూసుకుని నేతలకు ఎర వేస్తున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలను టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. వారిలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇక వార్తలపై లక్ష్మారెడ్డి స్పందించారు. తాను
కాంగ్రెస్‌ పార్టీని వీడిది లేదు.. కాంగ్రెస్ లోనే ఉంటా.. కాంగ్రెస్ లోనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నిన్నంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానంటూ.. పైగా ఇందుకోసం కేసీఆర్ ఫాం హౌజ్‌ లో తెరాస నేతలతో భేటీ అయినట్టు తనపై దుష్ప్రచారం జరుగుతోందని.. లక్ష్మారెడ్డి అన్నారు. అసలు పార్టీ మారాల్సిన అవసరం గానీ… కేసీఆర్‌ ఫాం హౌజ్‌కు వెళ్లాల్సిన అగత్యం నాకు లేదని అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా తమపై పుకార్లు వ్యాపింపజేయడం తగదని అన్నారు లక్ష్మారెడ్డి.

Next Story