నాకు ప్రధాని అవ్వాలని ఉంది : సీఎం కేసీఆర్

నాకు ప్రధాని అవ్వాలని ఉంది : సీఎం కేసీఆర్
x
Highlights

సాధారణ ఎన్నికలకు తొమ్మిదే నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారు తెరాస అధినేత కేసీఆర్. కేవలం రెండు నిమిషాల్లోనే ప్రభత్వాన్ని రద్దు చేస్తున్నట్టు...

సాధారణ ఎన్నికలకు తొమ్మిదే నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారు తెరాస అధినేత కేసీఆర్. కేవలం రెండు నిమిషాల్లోనే ప్రభత్వాన్ని రద్దు చేస్తున్నట్టు క్యాబినెట్ లో ఏకవాక్య తీర్మానం చేసిన అయన.. మంత్రులతో కలిసి నేరుగా గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు లేఖ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్బంగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టిక్కెట్లు పెండింగ్ లో ఉంచామని.. మరో ఇద్దరికి టికెట్లు నిరాకరించామని అందులో సినీ నటుడు బాబు మోహన్ కూడా ఉన్నారని అన్నారు. అందులో చెన్నూరు సీటును ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించామని అన్నారు.

దాదాపు 100 సీట్లు తెరాస గెలుచుకుంటుందని చెప్పారు. తనకు ఉన్న సమాచారం దృష్ట్యా అక్టోబర్ లో ఎన్నికలకు నోటిఫికేషన్ రావొచ్చని.. నవంబర్ చివరి వారంలో ఎన్నికలు జరిగి.. డిసెంబర్ కల్లా ఫలితాలు ప్రకటిస్తారని అనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే తృతీయ కూటమి గురించి కూడా మాట్లాడిన కేసీఆర్ అదికొంత మంది ఆలోచన అని.. ప్రయత్నం చేయడంలో తప్పేముందని అన్నారు. అనుకున్నవన్నీ జరగవని.. ఈ సందర్బంగా కేసీఆర్ తనకు ప్రధాన మంత్రి అవ్వాలని ఉంది అంతమాత్రాన అవుతానా అని ఆసక్తికర కామెంట్లకు తెరతీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories