logo
జాతీయం

పెను ప్రమాదం.. టాలీవుడ్ హీరోయిన్..

పెను ప్రమాదం.. టాలీవుడ్ హీరోయిన్..
X
Highlights

టాలీవుడ్ లో హీరో అల్లరి నరేష్ సరసన బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, సుడిగాడు చిత్రాల్లో నటించిన నటి మోనాల్‌ గజ్జర్‌ పెను ...

టాలీవుడ్ లో హీరో అల్లరి నరేష్ సరసన బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, సుడిగాడు చిత్రాల్లో నటించిన నటి మోనాల్‌ గజ్జర్‌ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్నేహితుడి పుట్టిన రోజు కార్యక్రమానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ఉదయ్‌పుర్‌ వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్‌పుర్‌ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హీరోయిన్ మోనాల్‌ గజ్జర్‌ మెడకు దెబ్బతగిలింది. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే ప్రమందంలో మోనాల్‌ మృతిచెందినట్టు వార్తలు రావడంతో ఆమె ఫేస్‌ బుక్‌ లైవ్‌కి వచ్చారు. తాను మరణించానని కొన్ని మీడియాల్లో వస్తున్న నిజం లేదని. తనతో పాటూ అందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని తెలియజేశారు. తన మెడకు దెబ్బ తగలడంతోనే బెల్ట్‌ ధరించినట్టు ఆమె పేర్కొన్నారు.

Next Story