హైదరాబాద్‌ కాటేదాన్‌‌లో దారుణం

హైదరాబాద్‌ కాటేదాన్‌‌లో దారుణం
x
Highlights

హైదరాబాద్‌ కాటేదాన్‌‌లో దారుణం జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఓనర్ రమేష్‌ గుప్తా దౌర్జన్యానికి దిగాడు. అద్దెకుంటున్న కుటుంబాన్ని బెదిరించి.... బాలికను...

హైదరాబాద్‌ కాటేదాన్‌‌లో దారుణం జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఓనర్ రమేష్‌ గుప్తా దౌర్జన్యానికి దిగాడు. అద్దెకుంటున్న కుటుంబాన్ని బెదిరించి.... బాలికను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇంటి యజమాని బెదిరింపులతో బెదిరిపోయిన బాలిక తల్లి.... వికలాంగుడైన 40ఏళ్ల రమేష్‌ గుప్తా‌కి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమైంది. అయితే అందుకు బాలిక తండ్రి ఒప్పుకోకపోవడంతో ఈ దారుణం బయటికి వచ్చింది.

తన ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబం పేదరికాన్ని ఆసారాగా తీసుకున్న ఇంటి ఓనర్‌ రమేష్‌ గుప్తా.... ఆ ఫ్యామిలీలోని బాలికపై కన్నేశాడు. మీరెలాగూ ఇంటి అద్దె కట్టలేరు కాబట్టి.... మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలంటూ బెదిరింపులకు దిగాడు. బాలిక తల్లిని బెదిరించి పెళ్లికి ఒప్పించాడు. పెళ్లికి బాలిక తండ్రి ఒప్పుకోకపోవడంతో... ఇంటి ఓనర్‌ రమేష్‌ గుప్తా... మొత్తం కుటుంబాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడు.

దిక్కుతోచని స్థితిలో తన సోదరుడి దగ్గరికి వెళ్లిన బాలిక... ఇంటి ఓనర్‌ దౌర్జన్యంపై చెప్పింది. కాళ్లూచేతులు చచ్చుబడిన 40ఏళ్ల వికలాంగుడు తనను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చైల్డ్‌ లైన్‌ సంస్థకు ఫిర్యాదు చేసింది. చైల్డ్‌ లైన్‌ సంస్థ ప్రతినిధులు.... మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.... పెళ్లిని అడ్డుకున్న పోలీసులు..... ఇంటి యాజమాని రమేష్‌‌ గుప్తా, బాలిక తల్లిని అరెస్ట్‌ చేసి.... బాధితురాలిని స్టేట్‌ హోమ్‌కి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories