గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అరాచకం

x
Highlights

తప్పులు బయటపడతాయని.. తమ లొసుగులు తేటతెల్లం అవుతాయని.. ఓ ప్రైవేటు స్కూలు ఏకంగా.. విద్యార్థులను టెర్మినేట్ చేసింది. తాము చెప్పినట్లు వినలేదంటూ ముగ్గురు...

తప్పులు బయటపడతాయని.. తమ లొసుగులు తేటతెల్లం అవుతాయని.. ఓ ప్రైవేటు స్కూలు ఏకంగా.. విద్యార్థులను టెర్మినేట్ చేసింది. తాము చెప్పినట్లు వినలేదంటూ ముగ్గురు పిల్లలను స్కూల్ కు రావొద్దంటూ హుకూం జారీ చేసింది. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని గాడియం స్కూల్ అరాచకం కారణంగా పిల్లల భవిష్యత్తు అయోమయంలో పడింది.

ఇది హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని గాడియం ఇంటర్నేషన్ స్కూలు. గాడియం అంటే లాటిన్ భాషలో జాయ్ అండ్ హోప్ అని అర్థం. తల్లిదండ్రులు కూడా అదే నమ్మకంతో తమ పిల్లలను ఈ స్కూళ్లో చేర్చారు. కానీ వారి నమ్మకం వమ్మైంది. ఇందులో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులంతా కలిసి.. ఓ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసుకున్నారు. చిన్నారుల సమస్యలతో పాటు.. స్కూలు గురించి కూడా ఇందులో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు అందించే ఫుడ్ తో పాటు బిల్డింగ్ నిర్మాణంపై గ్రూప్ లో చాట్ చేసుకున్నారు. మేనేజ్ మెంట్ అందిస్తున్న ఫుడ్ సరిగ్గా లేకపోవడంతో కొందరు విద్యార్థులు జబ్బు కూడా పడ్డారన్న విషయాన్ని .. పేరెంట్స్ షేర్ చేసుకున్నారు.

అయితే ఈ విషయాన్ని పేరెంట్స్ అంతా కలిసి.. యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ తతంగాన్ని భరించలేని స్కూల్ యాజమాన్యం చిన్నారులను టార్చర్ చేయడం మొదలుపెట్టింది. వెంటనే వాట్సాప్ గ్రూప్ ను డెలిట్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చింది. చిన్నారులను మానసికంగా హింసించింది. తమను ఎలా ప్రశ్నిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు వినకపోవడంతో.. ప్రిన్సిపల్ హేమ.. రెండో తరగతి చదువుతున్న ముగ్గురు స్టూడెంట్స్ కు టీసీ ఇచ్చి టెర్మినేట్ చేసింది.

గాడియం స్కూల్ వ్యవహారంపై పేరెంట్స్ భగ్గుమన్నారు. విద్యార్థులకు అందుతున్న ఫుడ్, బిల్డింగ్ నిర్మాణం గురించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో.. ప్రిన్సిపాల్ హేమ, ఇతర టీచర్లు కక్ష గట్టి వేధించారని చెబుతున్నారు. స్కూల్ లో జరిగిన విషయాన్ని తమ దగ్గర చెప్పుకుంటూ చిన్నారులు కన్నీరు పెట్టుకున్నారని.. ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే గాడియం స్కూల్ పై న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అయితే విషయం ఇష్యూగా మారకముందే.. స్కూల్ మేనేజ్ మెంట్ దిద్దుబాటు చర్యలకు పూనుకొంది. విషయాన్ని పెద్దగా చేయొద్దని.. చిన్నారుల పేరెంట్స్ ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories