భార్యను దారుణంగా హత్యచేసి.. ఆపై మద్యం సేవించి..

భార్యను దారుణంగా హత్యచేసి.. ఆపై మద్యం సేవించి..
x
Highlights

గుంటూరు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగింది....

గుంటూరు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగింది. వివరాల్లోకి వెళితే చేబ్రోలుకు చెందిన కొరగంటి కోటేశ్వరరావు నిజాంపట్నం ప్రాంతానికి చెందిన రమ్యకృష్ణ (35)ను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిద్దరిది రెండో వివాహమే. గతంలో చేబ్రోలు ప్రభుత్వ కళాశాలలో పనిచేసే కోటేశ్వరరావు గుంటూరు ఉమెన్స్‌ కళాశాలకు రికార్డు అసిస్టెంట్‌గా బదిలీ అయ్యాడు. చెడువ్యసనాలకు బానిసైన కోటేశ్వరరావు భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు ఈ క్రమంలో భార్య భర్తలమధ్య కలతలు రేగాయి. గురువారం వీరిమధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోపోద్రిక్తుడైన కోటేశ్వరరావు భార్యను రోకలి బండతో దాడి చేయడంతో రమ్యకృష్ణ అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం బయటికి వెళ్లి మద్యం సేవించి రోడ్డుపై తిరుగుతున్నాడు. ఇంతలో కానిస్టేబుళ్ల కంటపడి తాను భార్యను హత్య చేశానని ఒప్పుకున్నాడు. దాంతో అతన్నిస్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. తండ్రి చేతిలో తల్లి దారుణహత్యకు గురవడంతో ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories