దారుణం : భర్త కొట్టిన దెబ్బలకు భార్య మృతి!

దారుణం : భర్త కొట్టిన దెబ్బలకు భార్య మృతి!
x
Highlights

కట్టుకున్న భర్త తీవ్రంగా కొట్టడంతో భార్య మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యానక...

కట్టుకున్న భర్త తీవ్రంగా కొట్టడంతో భార్య మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యానక రంగారావు, రాజేశ్వరి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆదివారం రాత్రి ఓ చిన్న విషయమై వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త రంగయ్య రాజేశ్వరిని తీవ్రంగా కొట్టాడు. ఆమె తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం గ్రామంలోని ఆరెంపీ వద్దకు తీసుకెళ్లగా అతను పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించాడు. దీంతో ఆటోలో రక్తస్రావం అవుతున్న ఆమెను వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లమని ఆరెంపీ తల్లి ఆటోలో ఎక్కించి పంపింది. ఆటో డ్రైవర్‌ ఆమెను తీసుకువెళ్తుండగా అందులో నుంచి కింద పడిపోయింది. దీంతో డ్రైవర్ పోలీసులకు సమాచారమందించాడు పోలీసులు అక్కడికి చేరుకునే లోపే రాజేశ్వరి మృతిచెందింది. ఇక ఆమె మృతికి కారణమైన భర్త రంగయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories