Top
logo

మేడారంలో భారీగా ట్రాఫిక్... బాలింత మృతి

మేడారంలో భారీగా ట్రాఫిక్... బాలింత మృతి
X
Highlights

మేడారం జాతర రూట్ లో ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఆదిలాబాద్ జిల్లా హద్గం గ్రామానికి చెందిన 30...

మేడారం జాతర రూట్ లో ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఆదిలాబాద్ జిల్లా హద్గం గ్రామానికి చెందిన 30 మంది భక్తులు మేడారానికి నడిచి వెళుతున్నారు. మార్గమధ్యంలో పస్రా వద్ద నిండు గర్భిణీ అయిన కళాబాయికి పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే ఆమెను ఏటూరునాగారం వైద్యశాలకు తరలించగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, కళాబాయికి రక్తస్రావం కావడంతో ములుగు ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. 108 అంబులెన్స్ లో ఆమెను తరలిస్తుండగా...వాహనం మేడారం జాతర ట్రాఫిక్ లో చిక్కుకుంది. వైద్యం ఆలస్యం కావడంతో కళాబాయి కన్నుమూసింది. ములుగు ఆసుపత్రిలో బాబును చేర్పించారు. మేడారం ట్రాఫిక్ జామ్ తోపాటు ఏటూరునాగారం ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story