ఒక దాన్ని చంపితే మరోటి వస్తుంది : ఇప్పటికే పాములకాటుకు గురైన 250 మంది.. కారణం ఏంటంటే..

ఒక దాన్ని చంపితే మరోటి వస్తుంది : ఇప్పటికే పాములకాటుకు గురైన 250 మంది.. కారణం ఏంటంటే..
x
Highlights

కృష్ణా జిల్లాలో పాముల దెబ్బకు రైతులు భయంతో వణికిపోతున్నారు. కొంతకాలంగా అవనిగడ్డ, చల్లపల్లి, నాగాయలంక,మోపిదేవి ప్రాంతంలో పాముల సమస్య మరింత తీవ్రంగా...

కృష్ణా జిల్లాలో పాముల దెబ్బకు రైతులు భయంతో వణికిపోతున్నారు. కొంతకాలంగా అవనిగడ్డ, చల్లపల్లి, నాగాయలంక,మోపిదేవి ప్రాంతంలో పాముల సమస్య మరింత తీవ్రంగా ఉంది. పదిరోజుల వ్యవధిలో దాదాపు 250 మంది రైతులు పాముకాటుకు గురయ్యారు. ప్రస్తుతం చాలా మంది అవనిగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి పాములు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆరాతీసారు. ఇదిలావుంటే పాముల బెడద లేకుండా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నాగదోషం పరిహరింపబడాలని కోరుతూ ఈ నెల 29న సర్పశాంతి హోమం చేసేందుకు సిద్ధమవుతున్నారు అవనిగడ్డ ప్రజలు. దీనికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం వేదిక కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. కాగా దివిసీమ ప్రాంతాల్లోని పొలాల్లో పెద్ద ఎత్తున ఎలుకలు ఉండటంతో వాటి కోసం పాములు మాటు వేస్తున్నాయి. పొలాల్లో నాట్ల కోసం దిగుతున్న రైతు కూలీలపై విరుచుకు పడుతున్నాయి. దొరికిన వాళ్లను దొరికినట్టు పాములు కాటేస్తుంటే.. చేతికి చిక్కిన పామునల్లా జనం చంపేస్తున్నారు. ఒక దాన్ని చంపితే మరోటి వస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories