డిసెంబర్‌లోనే కయ్యానికి కాలుదువ్వుతున్న కోడి పుంజులు

Highlights

సంక్రాంతికి మరో నెల రోజులకు పైగా ఉంది. కానీ అప్పుడే గోదావరి జిల్లాల్లో సందడి మొదలైంది. ప్రతిఏటా జనవరి నెలలో రోషంతో కూసే పుంజులు ఈ సారి డిసెంబర్ లోనే...

సంక్రాంతికి మరో నెల రోజులకు పైగా ఉంది. కానీ అప్పుడే గోదావరి జిల్లాల్లో సందడి మొదలైంది. ప్రతిఏటా జనవరి నెలలో రోషంతో కూసే పుంజులు ఈ సారి డిసెంబర్ లోనే కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. దీంతో ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పుంజుల సందడి కనిపిస్తుంది. కోడిపందాలు చట్టప్రకారం నేరమైనా సంక్రాంతి సింబల్ గా భావించే కోడిపందాలు లేకుండా పండగ జరగదు. తూర్పుగోదావరి జిల్లాల్లో కోడికూతలు మొదలెన సంక్రాతి సందడిపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

సంక్రాంతికి కూయాల్సిన కోడి ఈసారి ముందే కూస్తుంది. కోడిపుంజులు సమరానికి సై అనడంతో తూర్పుగోదావరి జిల్లాలో పందెంరాయుళ్లు కూడా రెడీ అయిపోయారు. ఇప్పటికే కోనసీమతో పాటు, ఏజెన్సీ ప్రాంతాల్లో కోడిపందెలు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కోడిపందేలపై దాడులు జరుపుతున్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా గోదావరి జిల్లాలో చాలా చోట్ల కోడిపందేలు నిర్వహిస్తున్నారు. దీంతో సంక్రాంతి సందడి ముందే వచ్చేసిందంటూ జనం చర్చించుకుంటున్నారు.

ప్రతిఏటా తూర్పుగోదావరి జిల్లాలో కోట్ల రుపాయలు కోడిపందేల రూపంలో చేతులు మారుతుంటాయి. సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచో కోడి పందేలు చూసేందుకు పల్లెటూళ్లకు అనేక మంది తరలివస్తుంటారు. పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్లు కుడా సంక్రాంతికి స్వగ్రామాల్లో జరిగే సంబరాల కోసం వస్తుంటారు. సంక్రాంతి సంబరాల్లో కోడి పందేలు హైలెట్‌గా నిలుస్తుంటాయి. అయితే తమిళనాడులో జరిగే జల్లికట్టు తరహాలో తమదీ సాంప్రదాయమేనని, సంక్రాంతికి కోడి పందాలు లేకపోతే పండగ వాతావరణమే ఉండదని పందెం రాయుళ్లు అంటున్నారు.

మరోవైపు గత ఏడాది సంక్రాంతి గడిచినప్పటి నుంచే ఈ ఏడాది పందెంలో పాల్గోనే పుంజుల తయారీకి అనేక శిక్షణ కేంద్రాలు కుడా తూర్పుగోదావరి ఉన్నాయి. రాజమండ్రి దివాన్ చెరువు, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, ఆత్రేయపురం, సఖినేటిపల్లిలతో పాటుగా చాలా చోట్ల ఏడాదిగా ఏపుగా పెంచిన కోళ్లకు పందెంలో శిక్షణ కుడా ఇస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా మాకాంలను ఏర్పాటు చేసి కోళ్లకు తర్ఫీదునిస్తున్నారు. కోడిపందెల నిర్వహణ ఈయేడాది ప్రత్యేక అనుమతులతో జరుగుతుందో లేక ప్రతిఏడాది లానే ఈసారి కుడా పోలీసులు కళ్లు మూసుకుని నడిపిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories