మొబైల్ యాప్ తో హైటెక్‌ వ్యభిచారం..

మొబైల్ యాప్ తో హైటెక్‌ వ్యభిచారం..
x
Highlights

శనివారం ఓ హైటెక్‌ వ్యభిచారం ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్‌ లైన్‌ ద్వారా రెసిడెన్షియల్‌ ఏరియాలో రూం బుక్‌ చేసుకొని అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న...

శనివారం ఓ హైటెక్‌ వ్యభిచారం ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్‌ లైన్‌ ద్వారా రెసిడెన్షియల్‌ ఏరియాలో రూం బుక్‌ చేసుకొని అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న యువతీయువకులను రాంచీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత రెండు నెలలుగా జార్ఖండ్‌ రాంచీలోని వింద్ర ప్యాలెస్‌లో కొంతమంది యువతులతో కలిసి సెక్స్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు కొందరు యువకులు. మొబైల్ యాప్ ద్వారా యువతీయువకులను ఆకర్షించి వారి వద్ద పెద్దమొత్తంలో డబ్బు వసూల్ చేసేవారు. పైగా అనుమానం రాకుండా ప్లాట్ లో రెసిడెన్షియల్‌ హోటల్ నడుపుతున్నట్టు కలరింగ్ ఇచ్చేవారు. ఇంటి తరహా భోజనం కావాలనుకునేవారు ఈ హోటల్ కు వస్తారని స్థానికులను నమ్మించారు. అయితే వీరి చర్యలు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వింద్ర ప్యాలెస్‌ పై దాడి చేశారు. దాడిలో నలుగురు యువతులు, నిర్వాహకులు, ఇతర వ్యక్తులు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మొబైల్ యాప్ డెవలప్ చేసిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం కోరుతున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories