టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు ఝలక్

టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు ఝలక్
x
Highlights

విజయవాడలో స్వాతంత్ర సమరయోధుడి భూకబ్జా కేసు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయింది. బోండా ఉమపై కేసు నమోదు చేయాలని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ...

విజయవాడలో స్వాతంత్ర సమరయోధుడి భూకబ్జా కేసు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయింది. బోండా ఉమపై కేసు నమోదు చేయాలని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడాన్నితప్పుబట్టిన హైకోర్టు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐకి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బోండా ఉమ వల్ల తనకు ప్రాణహాని ఉందని గతంలో బాధితుడు కోటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. బోండా ఉమ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోటేశ్వరరావు కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన హైకోర్టు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కృష్ణలంక సిఐకి కోర్టు ధిక్కారం నోటీసులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories