ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..

ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది....

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 5కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories