హీరో విశాల్‌ కీలక నిర్ణయం..తెలుగు రాష్ట్రాల...

హీరో విశాల్‌ కీలక నిర్ణయం..తెలుగు రాష్ట్రాల...
x
Highlights

తెలుగులో పుట్టి తమిళంలో రాణిస్తున్న తెలుగుబిడ్డ విశాల్‌ తన మంచి మనస్సును మరోసారి చాటుకున్నారు. ‘అభిమన్యుడు’ చిత్రం సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు...

తెలుగులో పుట్టి తమిళంలో రాణిస్తున్న తెలుగుబిడ్డ విశాల్‌ తన మంచి మనస్సును మరోసారి చాటుకున్నారు. ‘అభిమన్యుడు’ చిత్రం సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు ఇవ్వలని కీలక నిర్ణయం తీసుకున్నారు. సైబర్ క్రైం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మొదటి వారంలోనే రూ.12 కోట్ల వసూళ్లను రాబట్టింది.తమిళంలో విశాల్ గత చిత్రాలకంటే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. తమిళంలో ‘అభిమన్యుడు’ రూ.60 కోట్ల రూపాయలను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా విశాల్ నటించిన ప్రతి చిత్రాన్ని తెలుగులో కూడా రీలిజ్ చేస్తున్నాడు. జూన్‌1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అభిమన్యుడు’ మంచి టాక్‌ను తెచ్చుకుంది. మంచి వసూళ్ళను కూడా రాబట్టింది .ఈ నేపథ్యంలో విశాల్‌ టికెట్‌పై రూపాయి చొప్పున తెలుగు రాష్ట్రాల రైతులకు అందించాలని కీలక తీసుకున్నారు.ఈ మేరకు నిన్న అభిమన్యుడు సక్సెస్ మీట్ లో ప్రకటించాడు. ఇక విశాల్ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories