logo
జాతీయం

ఈదురుగాలల బీభత్సం.. నటి హేమమాలినికి తప్పిన పెను ప్రమాదం!

ఈదురుగాలల బీభత్సం.. నటి హేమమాలినికి తప్పిన పెను ప్రమాదం!
X
Highlights

ఈదురుగాలుల వాతావరణంతో ఉత్తరాదిని అతలాకుతలం చేస్తోంది.. ఆదివారం కురిసిన భారీ వర్షానికి చెట్లు, చిన్న చిన్న...

ఈదురుగాలుల వాతావరణంతో ఉత్తరాదిని అతలాకుతలం చేస్తోంది.. ఆదివారం కురిసిన భారీ వర్షానికి చెట్లు, చిన్న చిన్న ఇల్లులు కుప్పకూలాయి. ద్రోణి ప్రభావంతో ఢిల్లీ , ఉత్తరప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. దీంతో ఉత్తరప్రదేశ్ లోని మిథౌలి బహిరంగసభకు వెళుతున్న బీజేపీ ఎంపీ హేమమాలినికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్‌ వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలి రోడ్డుపై పడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాజస్థాన్ తోపాటు పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భయంకర వర్షాలకు దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు.

Next Story