Top
logo

ఇలా చేస్తే హెల్మెట్ ధరించినా జుట్టు రాలదు..

ఇలా చేస్తే హెల్మెట్ ధరించినా జుట్టు రాలదు..
X
Highlights

హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలుతుందనడంలో వాస్తవం లేదని అంటున్నారు నిపుణులు. అయితే హెల్మెట్ ధరిస్తే జుట్టు...

హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలుతుందనడంలో వాస్తవం లేదని అంటున్నారు నిపుణులు. అయితే హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలుతుంది అని భ్రమపడే వారికీ కొన్ని సలహాలు ఇస్తున్నారు వైద్యనిపుణులు.

*సాధారణంగా హెల్మెట్ ధరించడం వలన శిరస్సుకు ఆక్సిజన్ సరైన మొత్తంలో అంధక జుట్టు రాలుతుందనేది అపోహ మాత్రమే అని అంటున్నారు. జుట్టు పెరుగుదల అనేది ఆక్సిజన్ మీద ఆధారపడదని చెబుతున్నారు.

* కేవలం రక్తప్రసరణ ద్వారా జుట్టుకు ఆక్సిజన్ అందుతుంది. తద్వారా గట్టిగా బిగదీసినట్టు ఉండే హెల్మెట్ల కన్నా వదులుగా ఉండే హెల్మెట్లు వాడటం శ్రేయస్కరం.

*గట్టిగా తలకు అతుక్కుపోయి ఉండే హెల్మెట్లు జుట్టు అంచుల వరకు వెళ్లి రక్త ప్రసరణను నిలిపివేస్తాయి. దాంతో జుట్టుకు సరైన మొత్తంలో రక్తం అంధక జుట్టు రాలె ప్రమాదం ఉంది.

*హెల్మెట్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి.. లేదంటే అందులో దుమ్ము ధూళి చేరి స్కాల్ప్ కి ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో జుట్టు రాలె అవకాశముంది. అందువల్ల వారానికి రెండు సార్లైనా హెల్మెట్ ను శుభ్రం చేసి ఎండలో ఆరనిస్తే బ్యాక్టీరియా దూరమవుతుంది.

* ఇక హెల్మెట్ ధరించి దూరంప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు గంటకు ఒకసారైనా హెల్మెంట్ ను తీసి తలకు గాలి తగలనివ్వాలి. ఎక్కువ సేపు హెల్మెట్ పెట్టుకోవడం వలన తల బిగుతుగా అవుతుంది. ఆ సమయంలో మునివేళ్లతో స్కాల్ప్ ను మర్దన చేయాలి.

*ఇతర వ్యక్తుల హెల్మెట్లు ధరించడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు దీనివలన చుండ్రు, ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే హెల్మెట్ ధరించినా జుట్టు రాలే సమస్య ఉండదని చెబుతున్నారు.

Next Story