హలో కొంచెం జాగ్రత్త

హలో కొంచెం జాగ్రత్త
x
Highlights

దేశంలో ఏ భాషా చిత్రాలనైనా పైరసీ వణికించేస్తోంది. పైరసీకి భాషా భేదం, ప్రాంతీయ భేదం లేదు. ఉగ్రవాదంలా పైరసీ కూడా ఓ మహమ్మారిలా తయారైంది. కోట్లు...

దేశంలో ఏ భాషా చిత్రాలనైనా పైరసీ వణికించేస్తోంది. పైరసీకి భాషా భేదం, ప్రాంతీయ భేదం లేదు. ఉగ్రవాదంలా పైరసీ కూడా ఓ మహమ్మారిలా తయారైంది. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ కాకుండానే పైరసీ కోరల్లో చిక్కుకుంటోంది. థియేటర్లలో కంటే ముందే ఇంటర్ నెట్ లో ప్రింట్‌ వచ్చేస్తోంది. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు చిత్రపరిశ్రమ రకరకాలుగా ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. అన్నీ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమాకి పైరసీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని సినిమాలను పైరసీ చేసి బిట్లు బిట్లుగా మార్కెట్లో విడుద ల చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. కొంతమంది సినిమా చూసిన ప్రేక్షకులు ఉత్సాహంతో తమ సెల్ ఫోన్లతో సినిమాను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ విషయం లో కాస్త జాగ్రత్త వహిస్తే పైరసీ నుంచి భయపడొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories