logo
జాతీయం

తమిళనాడును వణికిస్తున్న వరుణుడు

తమిళనాడును వణికిస్తున్న వరుణుడు
X
Highlights

మొన్నటిదాకా తమిళనాడును గజ తుఫాను తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. గజ తుపాను దాటికి తమిళనాడు తీర ప్రాంతాలు...

మొన్నటిదాకా తమిళనాడును గజ తుఫాను తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. గజ తుపాను దాటికి తమిళనాడు తీర ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి, అయితే మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చెన్నై సహా 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ తెలిపింది. కాంచీపురం, విల్లుపురం, తిరువళ్లూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అలాగే తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటోంది. ఈ వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ హెచ్చరికలతో అధికారయంత్రాంగం అప్రమత్త మైంది. చెన్నై సహా 7 జిల్లాల్లో విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Next Story