వణికిపోతున్న ఆంద్ర, ఒడిశా..

వణికిపోతున్న ఆంద్ర, ఒడిశా..
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంద్ర, ఒడిశాలోని పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఒడిశా రాష్ట్రమంతటా భారీ నుంచి అతి భారీ...

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంద్ర, ఒడిశాలోని పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఒడిశా రాష్ట్రమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రా, ఓడిశా సరిహద్దుల్లో రోడ్డుకు సమాంతరంగా నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాయఘడ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి భువనేశ్వర్‌ నుంచి వెళ్లుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపైకి భారీగా వరద నీరు చేరింది. అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీట మునిగాయి.. వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్న విపత్తు నిర్వహణ బృందాలు.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories