ఓ వైపు రుతువపనాలు.. మరోవైపు వాయుగుండం..

ఓ వైపు రుతువపనాలు.. మరోవైపు వాయుగుండం..
x
Highlights

ఓ వైపు రుతువపనాలు.. మరోవైపు వాయుగుండం.. రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగాల్- ఒడిశా తీరాన్ని...

ఓ వైపు రుతువపనాలు.. మరోవైపు వాయుగుండం.. రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగాల్- ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం మరింత బలపడి వాయుగుండంగా మారింది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపనాలు మరోసారి క్రియాశీలకంగా మారాయి. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. మరోవైపు వాయుగుండానికి తోడు.. రేపటికి(18 వ తేదీ) ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

ఇప్పటికే ఆల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని రాజధాని హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కుండపోతతో పంటలు మునిగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షంతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. వర్షాల దాటికి పలు ఇల్లులు నేలమట్టమయ్యాయి. ఇక పూరి గుడిసెలో ఉండేవారి పరిస్థితి అయితే మరి దయనీయంగా ఉంది. నానుపు వాన పడుతుండటంతో గుడిసెల్లోకి నీరు చేరుతోంది. దాంతో వారు ప్రత్యామ్నాయం వైపు వెళుతున్నారు. ఇదలావుంటే మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories