శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
x
Highlights

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. వరదనీరు భారీగా చేరడంతో ప్రస్తుతం 8...

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. వరదనీరు భారీగా చేరడంతో ప్రస్తుతం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. నిన్న(బుధవారం) రాత్రి నుంచి మళ్లీ వరద పెరగడంతోనే సాగర్ నీరు ఎక్కువమొత్తంలో వదిలారు. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2 లక్షల 71 వేల క్యూసెక్యుల నీరు వస్తోంది. ఇప్పటికే డ్యామ్ దాదాపుగా గరిష్ట నీటిమట్టానికి చేరినందున వచ్చింది వచ్చినట్టు కిందికి వదిలేస్తున్నారు. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు అయితే.. ఇప్పటికి 206 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతోపాటు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 2 లక్షల 93 వేల క్యూసెక్కులు ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.5 అడుగులకు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories