చిన్న వయసులో హార్ట్‌ బీటలు.. ఎందుకీ సుడిగుండెలు

చిన్న వయసులో హార్ట్‌ బీటలు.. ఎందుకీ సుడిగుండెలు
x
Highlights

చిన్న వయసులోనే గుండెపోటు, తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి...మరోవైపు తూత్తుకుడి రక్తసిక్తమవుతూనే ఉంది... కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ...

చిన్న వయసులోనే గుండెపోటు, తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి...మరోవైపు తూత్తుకుడి రక్తసిక్తమవుతూనే ఉంది... కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు 21 ఏళ్ల వైష్ణవ్.. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో దూరమయ్యాడు. ఇంత అర్లీగా హార్ట్‌ అటాక్‌ రావడమేంటని అంటున్నారు. చిన్న వయస్సులో గుండెపోటు ఎందుకొస్తుంది? కారణాలేంటి?

చిన్నవయస్సులోనే గుండెపోటు మరణాలు దేశంలో పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అధికంగా నమోదవుతున్నాయి. ఎనిమిదేళ్లలో తెలంగాణలో, హృద్రోగ చికిత్సలు సుమారు 105 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. అత్యధిక కేసులు హైదరాబాద్‌లోనే. ఆరోగ్యశ్రీ గణాంకాల ప్రకారం, 2008-09 నుంచి 2016-17 వరకూ మొత్తం 2.20 లక్షల గుండెజబ్బు చికిత్సలు నమోదయ్యాయి. ఇందులో 15-35 ఏళ్ల వయసు బాధితులు 13.52 శాతం, 15-45 ఏళ్ల వయస్కులు 33.12 శాతం. అత్యవసర వైద్యసేవల నిర్వహణ, పరిశోధన సంస్థ జీవీకే-ఈఎంఆర్‌ఐ...గతేడాది అందించిన 108 సేవల్ని విశ్లేషిస్తే,. గుండెజబ్బుల బారినపడిన మొత్తం 12,021 మందిని అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించగా.. వీరిలో 15-34 ఏళ్ల వయసువారు 2,378. అంటే చేతికొచ్చే వయస్సులో చేతికందకుండాపోతున్నారు యువకులు. జీవనశైలి మార్పులే ఇందుక్కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నగరీకరణ పెరుగుతుండంతో జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. కాలంతోపాటు మన ఆహార వ్యవహారాల్లో, జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు తిండి, నిద్ర కరువయ్యాయి. శారీరక శ్రమ తగ్గి, మానసిక ఒత్తిడి పెరిగింది. మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలు పెరిగాయి. వీటన్నిటి ఫలితంగా శరీరం ఒడుదొడుకులకు గురవుతూ, క్రమేపీ ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది. ఈ పరిస్థితి గుండె జబ్బులకు దారి తీస్తోందని వైద్యులంటున్నారు. చిన్న వయసులో గుండె జబ్బులకు రావడానికి ప్రధాన కారణం రక్తపోటు, డయాబెటిస్, ధూమపానం. చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం. దీంతో పాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాల వాడకం కూడా పెరుగుతోంది. ఇలాంటి కారణాల వల్లనే చాలామంది చిన్న వయసులో స్థూలకాయం అనుభవిస్తున్నారు. ఈ అంశం కూడా చిన్న వయసులో వచ్చే గుండె సమస్యలకు దారి తీస్తుందని పరిశోధనలు, సంఘటనలు రుజువు చేస్తున్నాయి. వీటితో పాటు ఒత్తిడి, వంశపారంపర్యత కూడా ఈ చిన్న వయసులో వచ్చే గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories