మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టబోతున్న తెలంగాణ సర్కార్

మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టబోతున్న తెలంగాణ సర్కార్
x
Highlights

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నుంచి...

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు హైల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ అందించనున్నారు.

తెలంగాణా ప్రభుత్వం మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు ఏడు రకాలు పరీక్షలు నిర్వహిస్తారు. దీని కోసం రూపొందించాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి కడయం శ్రీహరి, ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

రాబోయే విద్యా సంవత్సరంలో జూలై నెల నుంచి విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు జరపాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. 31 జిల్లాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ విద్యాలయాల్లోని విద్యార్థులకి పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందిస్తారు. దీని కోసం విద్య, వైద్యశాఖలు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య కార్డులు ఇవ్వడానికి ప్రతి స్కూల్ కు ముందే షెడ్యూల్ అందచేస్తారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల విద్యాలయాలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థినులకి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా 7, 8, 9, 10 తరగతి బాలికలకు వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories