ఎండ నుంచి విముక్తి పొందాలంటే

ఎండ నుంచి విముక్తి పొందాలంటే
x
Highlights

ఎండలు అప్పుడే మండుతున్నాయి. శరీరం త్వరగా అలసిపోతుంది. ఈ సమస్యను అధిగమించటానికి కీర ఎంతో ఉపకరిస్తుంది. కీరతో చాలా లాభాలు ఉన్నాయి. 1. కీరలో విటమిన్...

ఎండలు అప్పుడే మండుతున్నాయి. శరీరం త్వరగా అలసిపోతుంది. ఈ సమస్యను అధిగమించటానికి కీర ఎంతో ఉపకరిస్తుంది. కీరతో చాలా లాభాలు ఉన్నాయి.

1. కీరలో విటమిన్ బి పుష్కలం. కాఫీలు, టీలు తాగే బదులు కీర ముక్కలు అప్పుడప్పుడు తింటే వేసవిలో ఉదర సమస్యలు తలెత్తవు.

2. కీర, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా కళ్లకింద నల్లచారలు రాకుండా కాపాడుతుంది. అప్పుడప్పుడు కీర ముక్కల్ని కళ్లమీద పెట్టుకుంటే స్వాంతన లభిస్తుంది.

3. ఎండలు అప్పుడే పెరిగాయి కనుక నీళ్ల మోతాదు ఎక్కువుగా ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. కీరలో 95 శాతం నీరు వుంటుంది. కాబట్టి తరచూ దీన్ని తినవచ్చు. శరీరం డీహైడ్రేడ్ అవ్వదు. వ్యర్ధాలు కూడా బయటకు తొలగిపోతాయి. చర్మానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది.

4. మెుండి వ్యాధి క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసేగుణం కీర సొంతం. రోజు ఒకటి చొప్పున తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.

5. రాత్రి పడుకునే ముందు కొన్ని కీర ముక్కలు తింటే ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు వచ్చే తలనొప్పి ఉండదు. హ్యాంగోవర్ తగ్గుతుంది.

6. బరువు తగ్గటానికి కీర ఎంతో ఉపకరిస్తుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా కొన్ని తాజా కీర ముక్కల్ని తింటే.. అధిక బరువు సమస్య తగ్గుతుంది. ఎందుకంటే జీర్ణప్రక్రియకు కావల్సిన పీచుపదార్థం లభిస్తుంది. కనుక ఎప్పటికప్పుడు శరీరంలోని మలినాలు కూడా తొలగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories