అజరుద్దీన్‌కు అవమానం..అజరుద్దీన్‌ను అడ్డుకున్న వివేక్

x
Highlights

భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్ అజరుద్దీన్‌కు అవమానం జరిగింది. అది కూడా తన సొంతనగరంలో. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌...జనరల్ బాడీ సమావేశానికి...

భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్ అజరుద్దీన్‌కు అవమానం జరిగింది. అది కూడా తన సొంతనగరంలో. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌...జనరల్ బాడీ సమావేశానికి అజరుద్దీన్‌ను అనుమతించలేదు. ఇదేమైనా టీఆర్‌ఎస్‌ మీటింగా అనుకుంటున్నారా అంటూ వివేక్‌ తీరుపై వీహెచ్‌ మండిపడ్డారు. అటు అజరుద్దీన్‌ కూడా వివేక్‌ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహ్మద్‌ అజరుద్దీన్‌ భారత్‌ జట్టుకు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. క్రికెట్‌లో హైదరాబాద్‌ పేరును అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశాడు. తన బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. అయితే ఇదంత గతం. సొంత రాష్ట్రంలో అజరుద్దీన్‌కు ఊహించని షాక్ తగిలింది. హెచ్‌సీఎ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన అజరుద్దీన్‌ను హెచ్‌సీఎ ప్రెసిడెంట్‌ వివేక్ అడ్డుకున్నారు. సభ్యుల రిప్లై కోసం అజరుద్దీన్‌ ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది.

వివేక్‌ తీరుపై కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మైక్‌ను లాక్కూని నేలకేసి కొట్టారు. ఇదేమైనా టీఆర్‌ఎస్‌ మీటింగా అనుకుంటున్నారా ? అంటూ హెచ్‌సీఎ ప్రెసిడెంట్ వివేక్‌‌పై మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్‌సీఏ లోథా సిఫార్సులన్నింటినీ అమలు చేస్తుందని వివేక్‌ చెప్పారు.

అజరుద్దీన్‌ను మీటింగ్‌కు అనుమతించకపోవడంపై హెచ్‌సీఎ అధ్యక్షుడు వివేక్ వివరణ ఇచ్చారు. తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌కు అజరుద్దీన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని హెచ్‌సీఎకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో సమావేశానికి అనుమతివ్వలేదన్నారు. హెచ్‌సీఎ మాజీ అధ్యక్షుడు శివలాల్‌యాదవ్...వివేక్‌ మాట్లాడి, అజరుద్దీన్‌ను సమావేశానికి తీసుకెళ్లారు. దీంతో వివాదం కాస్తా సద్ధుమణిగినా...జనరల్‌ బాడీ సమావేశం మాత్రం వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories