ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కింది : మంత్రి హరీష్ రావు

ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కింది : మంత్రి హరీష్ రావు
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని ఈ ఏడాదే పూర్తిచేసి ఆయకట్టుకు నీరిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. కరీంనగర్ జిల్లా త్వరలోనే కోనసీమను తలపిస్తదన్నారు....

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని ఈ ఏడాదే పూర్తిచేసి ఆయకట్టుకు నీరిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. కరీంనగర్ జిల్లా త్వరలోనే కోనసీమను తలపిస్తదన్నారు. జగిత్యాల జిల్లాలో మంత్రి హరీశ్ రావు.. మరో మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కథలాపూర్‌ మండలంలో సూరమ్మ జలాశయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు.. సూరమ్మ జలాశయానికి అవసరమైన 300 ఎకరాల భూమి ఇస్తే సూరమ్మ చెరువులో నీటిని నింపే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి జలాశయాన్ని ప్రారంభించి చుక్క నీరు నింపలేదని మండిపడ్డారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూడేళ్లలో 35 టీఎంసీలు నింపామన్నారు.దీంతో ఎల్లంపల్లి కింద రైతులకు నీరిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories