బ్యాడ్ న్యూస్ : సగం ఏటీఎంలు మూసివేత.. కారణం ఏంటంటే..

అసలే అరకొర ఏటీఎంలు, అందునా నగదు కొరత ఎదుర్కుంటున్న ప్రజలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది...
అసలే అరకొర ఏటీఎంలు, అందునా నగదు కొరత ఎదుర్కుంటున్న ప్రజలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది మర్చినాటికల్లా సగం ఏటీఎంలు మూసివేయాలని ఏటీఎంల సమాఖ్య భావిస్తోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన నవీకరణలు, క్యాష్ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్, క్యాష్‌ను లోడ్ చేయడం వంటి విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం తలకు మించిన భారంగా ఉంటుందని ఏటీఎంల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది.అలాగే ఏటీఎంల నిర్వహణకు వివిధ బ్యాంకులనుంచి 3వేల కోట్ల అదనపు భారం పడతుందని అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2 లక్ష 38 వేల ఏటీఎంలలో సగం 2019 మార్చికల్లా మూసివేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే జరిగితే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు, అనేక రంగాలపై ప్రభావం పడనుందని
ఏటీఎంల సమాఖ్య తెలిపింది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలు ఎక్కువ మూసివేతకు గురవుతాయని తెలిపింది. ప్రభుత్వం అందించే సబ్సిడీల సొమ్మును ఏటీఎం నుంచి పొందడం ఇకనుంచి ప్రజలకు కష్టంగా మారనుందని తెలిపింది.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 5కే రన్
11 Aug 2022 3:19 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMT