హెచ్‌1బీ వీసాల్లో మనదే అగ్రవాటా

హెచ్‌1బీ వీసాల్లో మనదే అగ్రవాటా
x
Highlights

అమెరికాకు వచ్చే విదేశీ నిపుణుల్లో.. అత్యధిక వాటా భారతీయులదే అని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హెచ్‌ వన్ బీ వీసాల్లో ఎక్కువగా భారతీయులకే...

అమెరికాకు వచ్చే విదేశీ నిపుణుల్లో.. అత్యధిక వాటా భారతీయులదే అని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హెచ్‌ వన్ బీ వీసాల్లో ఎక్కువగా భారతీయులకే అందుతున్నట్లు.. తేల్చిచెబుతున్నాయి. 2016, 2017 సంవత్సరాల్లో జారీ అయిన హెచ్ వన్ బీ వీసాల్లో 74 శాతానికి పైగా మనదేశ నిపుణులదే అని ఆ నివేదిక వెల్లడించింది. అమెరికాలోని వలస సేవల సంస్థ అందించిన నివేదిక ప్రకారం.. రెండోస్థానంలో చైనా నిపుణులున్నట్లు తేలింది.

2017లో హెచ్‌-వన్ బీ వీసాల కోసం వచ్చిన 3 లక్షల 65 వేల 682 దరఖాస్తుల్లో 75.6 శాతం వీసాలను భారతీయులే దక్కించుకున్నారు. అంటే 2 లక్షల 76 వేల 423 వీసాలు మనోళ్లవే. అలాగే 2016 లో కూడా 3 లక్షల 45 వేల 262 దరఖాస్తుల్లో.. 74.2 శాతం అంటే 2 లక్షల 56 వేల 226 వీసాలు.. భారతీయ నిపుణులవే. ఇక మనదేశం తర్వాత అత్యధికంగా హెచ్‌-వన్ బీ వీసాలను చైనా దక్కించుకుంటోంది. 2016లో మొత్తం ‘హెచ్‌-1బీ’ల్లో 9.3 శాతం వీసాలను చైనీయులు అందుకున్నారు. 2017లో అది 9.4 శాతంగా నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories