Top
logo

హెచ్1- బీ వీసాల ధ‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం

హెచ్1- బీ వీసాల ధ‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం
X
Highlights

ఉద్యోగ నిమిత్తం వచ్చే విదేశీ నిపుణులను అమెరికాకు అనుమతించే హెచ్‌1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ...


ఉద్యోగ నిమిత్తం వచ్చే విదేశీ నిపుణులను అమెరికాకు అనుమతించే హెచ్‌1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ రేపటి(సోమవారం-ఏప్రిల్2) నుంచి ప్రారంభం కానుంది. అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి(2019) సంబంధించిన ఈ దరఖాస్తులను ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌర వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది.
అయితే, ఈసారి వీసాలు లభించడం అంత సులు మాత్రం కాదు. ఎందుకంటే.. వీసాదారులు గతంలో కంటే ఎక్కువ నిబంధనలను ఈసారి ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీసాల జారీ విషయంలో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా ఉండేందుకు కఠినమైన చర్యలను యూఎస్‌సీఐఎస్‌ చేపట్టింది.
హెచ్‌1బీ వీసాల జారీకి నిర్వహించే లాటరీలో తమ పేరును ఎలాగైనా పొందేందుకు ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారాలు దాఖలు చేయడంపై నియంత్రణకు యూఎస్‌సీఐఎస్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒకే పేరు మీద దాఖలయ్యే నకిలీ దరఖాస్తులను తిరస్కరిస్తామని యూఎస్‌సీఐఎస్‌ తేల్చి చెప్పింది.
హెచ్‌1బీ దరఖాస్తులోని అన్ని విభాగాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని.. దీంతో పాటు పిటిషనర్‌ పాస్‌పోర్టు నకలును కూడా జతచేయాల్సి ఉంటుందని యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది. ఒక్కో అర్థిక సంవత్సరానికి 65వేల హెచ్‌1బీ వీసాలను మాత్రమే అమెరికా జారీ చేస్తుంది
కాగా, హెచ్1బీ వీసాలపై ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులు ఆధారపడి ఉంటున్నారు. మరోవైపు అమెరికా తమ దేశంలో ప్రవేశించే వారికి ఇచ్చే వీసా ప్రక్రియను కూడా కఠినతరం చేసేలా నిబంధనలు రూపొందిస్తోంది. వీసా దరఖాస్తుదారులు గత ఐదేళ్లలో ఉపయోగించిన ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ చిరునామా, సామాజిక మాధ్యమాల చరిత్రను సమర్పించాలని కూడా పేర్కొంది.
ఇది ఇలా ఉండగా, ఇప్పటికే అమెరికాలోని కంపెనీల అవసరాల రీత్యా సత్వరమే హెచ్‌1బీ వీసాలను మంజూరు చేసేందుకు వీలున్న ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు ఈ ప్రీమియం ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తామనే దానికి సంబంధించిన తేదీని తర్వాత ప్రకటిస్తామని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది.

Next Story