సేల్ఫీ సూసైడ్ : భార్యకు వేరే యువకుడితో ఎఫైర్… భర్త సూసైడ్

x
Highlights

ప్రాణానికి ప్రాణంగా భావించిన భార్య తనను మోసం చేయడంతో ఓ భర్త మనస్తాపానికి గురయ్యాడు. జీవితానికి ముగింపు పలికాడు. తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటూ...

ప్రాణానికి ప్రాణంగా భావించిన భార్య తనను మోసం చేయడంతో ఓ భర్త మనస్తాపానికి గురయ్యాడు. జీవితానికి ముగింపు పలికాడు. తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటూ సెల్ఫీ వీడియోలో రికార్డు చేసిమరీ ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడ కృష్ణలంకకు చెందిన రామిరెడ్డి పెద్ద కుమారుడు గురవారెడ్డి అదే ప్రాంతానికి చెందిన గాయత్రిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి నాలుగేళ్ల క్రితం గాయత్రిని పెళ్లిచేసుకున్నాడు. కొంతకాలం అన్యోన్యంగా వీరి కాపురం సాగింది. ఇటీవల కార్తీక్ అనే యువకుడు గాయత్రికి పరిచయం అయ్యాడు. వారిద్దరూ తరచూ మాట్లాడుకోవడం, ఛాటింగ్‌లు చేసుకోవడం తెలుసుకున్న గురవారెడ్డి తన భార్యను ప్రశ్నించాడు. ఇటువంటి పనులు మంచిది కాదని, మంచిగా ఉండాలని సూచించడంతో ఆమె కూడా కొన్ని రోజులు సైలెంట్ గా ఉంది. అయితే మళ్లీ ఇటీవల కార్తీక్‌తో ఫోన్ మాట్లాడటాన్ని గమనించిన గురవారెడ్డి మరోసారి హెచ్చరించాడు. దీంతో గాయత్రి, ఆమె కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

గాయత్రి కుటుంబసభ్యుల ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు కావడంతో గురవారెడ్డిని, అతని తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. గురవారెడ్డిని రెండు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచడంతో మనస్తాపానికి గురయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయే తనను ఇలా అవమానించేలా వ్యవహరించడంతో ఇక తనువు చాలించాలనుకున్నాడు. అంతే విజయవాడ రైల్వేస్టేషన్‌కు వెళ్లి తాను ఆత్మహత్యచేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నాడు. ఆతర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు భార్య గాయత్రి, అత్తమామలు, బావ మరిది కారణమని వీడియో లో చెప్పడంతో పాటు, తల్లిదండ్రులను క్షమించాలని కోరాడు.

కార్తీక్ అనే యువకుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడేదని, దీనిపై అన్న అభ్యంతరం వ్యక్తం చేసినా ఆమె వినలేదని గురవారెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి అంటున్నాడు. నిలదీసినందుకు ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడి తమ కుటుంబం మొత్తాన్ని పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. గురవారెడ్డి సెల్ఫీ వీడియో చూసిన అతని స్నేహితులు కంట తడి పెట్టారు. కోరి చేసుకున్న ఇల్లాలే తన చావుకు కారణం అవుతుందని గురవారెడ్డి ఊహించలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు ముందు గరువారెడ్డి సెల్ఫీ వీడియో ఆధారంగా గాయత్రి, ఆమె కుటుంబ సభ్యులు, గాయత్రి ప్రియుడు కార్తీక్‌పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories