దేశం మొత్తం డిసెంబర్‌ 18వైపే చూపు

దేశం మొత్తం డిసెంబర్‌ 18వైపే చూపు
x
Highlights

డిసెంబర్‌ 18…. దేశంలో రాజకీయ, ఆర్థిక విధానాలకు దిశ, దశ చూపనుంది. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అది కూడా మంచి ఆధిక్యతతో మోదీ,...

డిసెంబర్‌ 18…. దేశంలో రాజకీయ, ఆర్థిక విధానాలకు దిశ, దశ చూపనుంది. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అది కూడా మంచి ఆధిక్యతతో మోదీ, అమీత్‌షా ఆధిపత్యాన్ని నిరూపించుకోగలిగితే దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు వారిద్దరూ కోరుకున్న విధంగా పూర్తి స్థాయిలో సాగేందుకు అవకాశం ఉంటుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సోమవారం వెలువడే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఒకపక్క ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడం, మరోపక్క కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వెలువడుతున్న ఫలితాలు కావడంతో రాజకీయంగా ఎంతో ఆసక్తిని నెలకొంది. ఈ ఎన్నికల ద్వారా భాజపా పార్టీ వరుసగా ఆరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని చూస్తుండగా, రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ నేపధ్యంలో రేపు విడుదల అయ్యే ఫలితాలపైనే అందరి దృష్టి పడింది. ఇప్పటికే భాజపాకే మరోసారి అధికారం దక్కుతుంది అని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెబుతున్నప్పటికీ ఫలితాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. గుజరాత్‌లోని 33 జిల్లాల్లోని 37 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories