జీఎస్‌టీ సమావేశం కీలకాంశాలు ఇవే..

జీఎస్‌టీ సమావేశం కీలకాంశాలు ఇవే..
x
Highlights

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లలో కొన్నింటిని తొలగిస్తామనిషి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఆ దిశగా చర్యలు...

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లలో కొన్నింటిని తొలగిస్తామనిషి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది కేంద్రం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ మండలి 33 వస్తువులపై పన్ను తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో

*రవాణా వాహణాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను 12 శాతం స్లాబ్ లోకి తీసుకువచ్చారు.
*మోటార్ వెహికల్ పార్టులు, టీవీ, కంప్యూటర్ల రేట్లు తగ్గుతాయి
*సిమెంట్, ఆటోమొబైల్స్ తప్ప మిగిలినవన్నీ 28 శాతం నుంచి బయటకు తెప్పించారు
*స్పోర్ట్స్ ఐటమ్స్ ను కూడా 28 శాతం స్లాబ్ నుంచి తొలగించారు
* 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలు, వీడియోగేమ్స్‌పై పన్ను 28శాతం నుంచి 18శాతానికి తగ్గింపు
సినిమా టిక్కెట్లు వంద రూపాయిల కన్నా ఎక్కువ ఉంటే 28 నుంచి 18 శాతం స్లాబ్ రేట్ లోకి, 100 రూపాయిలకన్నా తక్కువ ధర ఉంటే.. 18 శాతం నుంచి 12 శాతం స్లాబ్ రేట్ లోకి వచ్చాయి.
*వికలాంగులను తరలించే వాహనాలను కూడా 28 శాతం నుంచి బయటకు తీసుకువచ్చారు
*బేసిక్ సేవింగ్స్ అకౌంట్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు
*ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం విమానాల్లో ప్రయాణించేవారికి ప్రీమియం ట్యాక్స్ తొలగింపు
* విమానం టికెట్లు ఎకానమీ క్లాసుపై 5శాతం, బిజినెస్‌ క్లాసుపై 12శాతం జీఎస్‌టీ
* జన్‌ధన్‌ ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories