రాకెట్‌ ప్రయోగాలకు శ్రీహరి కోటే ఎందుకు? షార్‌కు ఉన్న ప్రత్యేకతలేంటి?

రాకెట్‌ ప్రయోగాలకు శ్రీహరి కోటే ఎందుకు? షార్‌కు ఉన్న ప్రత్యేకతలేంటి?
x
Highlights

ఇస్రో ప్రయోగం అనగానే, అందరి మదిలోనే మెదిలేది శ్రీహరి కోట. చంద్రయాన్‌, మంగళయాన్‌‌లతో పాటు మొన్నటి బాహుబలిలాంటి రాకెట్‌, నేడు నింగి నుంచి నిఘా జల్లెడ...

ఇస్రో ప్రయోగం అనగానే, అందరి మదిలోనే మెదిలేది శ్రీహరి కోట. చంద్రయాన్‌, మంగళయాన్‌‌లతో పాటు మొన్నటి బాహుబలిలాంటి రాకెట్‌, నేడు నింగి నుంచి నిఘా జల్లెడ పట్టే జీశాట్ వరకూ, ఎన్నో, మరెన్నో చారిత్రాత్మక ప్రయోగాలకు వేదికైంది నెల్లూరులోని శ్రీహరి కోట. అసలు శాటిలైట్‌లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తున్నారు...ఎందుకంటే, షార్‌కు ఉన్న ప్రత్యేకతలు అలాంటివి మరి...దాని ప్లేస్‌ అలాంటిది...శ్రీహరి కోట స్పేస్‌ సెంటర్‌కు, ఐదు ప్రత్యేకతలున్నాయి...అవెంటో చూద్దామా?

భారత దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతముంది. వేటికవే భిన్నమైన కోస్టల్ ప్రాంతాలున్నాయి. తిరువనంతపురంలో ఉపగ్రహ తయారీ కేంద్రముంది. హసన్‌, లఖ్‌నవూ, మారిషస్‌లలో శాటిలైట్ ఎర్త్ సెంటర్లున్నాయి. హసన్‌, భోపాల్‌లలో రాకెట్లను నియంత్రించే మాస్టర్‌ కంట్రోల్‌ కేంద్రముంది. అయినా అంతరిక్ష ప్రయోగాలకు, కేంద్రంగా, నెల్లూరులోని శ్రీహరి కోటనే ఎంపికైంది. ఎందుకంటే, దానికున్న ప్రత్యేకతలు, దేశంలోని ఏ ప్రాంతానికీ లేవు. మరి అవేంటి?

1. భూమధ్యరేఖకు దగ్గర..
శ్రీహరి కోట, భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంది. ఇదే ఇస్రో శాస్త్రవేత్తలను ఆకర్షించింది. ఎందుకంటే, ఇక్కడి నుంచి రాకెట్‌ నింగిలోకి పంపితే, పెద్దగా ఖర్చుండదు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నందుకు, స్పేస్‌ స్టేషన్‌ నుంచి పైకి ఎగిరిన తర్వాత, సెకన్‌కు 0.4 కిలోమీటర్ల అదనపు స్పీడ్‌ అందుకుంటుంది రాకెట్. భూభ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. తూర్పు దిశ రాకెట్ ప్రయోగాలకు, దేశంలో అత్యంత అనువైన ప్రాంతం షార్ మాత్రమే.

ప్రపంచంలో ఏ దేశమైనా, ఉపగ్రహ ప్రయోగాలకు భూమధ్య రేఖను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటాయి. అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్‌, ఫ్రెంచ్‌గయానాలో కౌరూ స్పేస్ సెంటర్, భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే రాకెట్లను నింగిలోకి పంపుతోంది యూరప్.

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. పశ్చిమం నుంచి తూర్పు దిశగా చక్కర్లు కొడుతోంది. రాకెట్‌ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే, భూపరిభ్రమణ వేగం కారణంగా దానికి, అదనపు వేగం తోడవుతుంది. అంతేకాదు, రాకెట్లు భూగురుత్వాకర్షణకు లోనుకాకుండా, భూమి చుట్టూ స్థిరంగా తిరుగుతూ ఉండాలి. భూమధ్య రేఖ సమీపం నుంచి ప్రయోగించే రాకెట్‌తో శాటిలైట్‌ను ఆ కక్ష్యలో చేర్చడం చాలా ఈజీ. అందుకే కమ్యూనికేషన్‌ శాటిలైట్లను భూమధ్య రేఖ సమీపం నుంచే అంతరిక్షంలోకి పంపుతారు. ఒకవేళ భూగురుత్వాకర్షణకు గురైతే, శాటిలైట్ గమనంలో కొన్ని మార్పులు రావొచ్చు. అప్పుడు స్థిర కక్ష్యలో కంటిన్యూ అయ్యేందుకు చాలా ఎనర్జీని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి గతి తప్పి భూమి వైపు దూసుకురావొచ్చు. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు, అన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారని, శాస్త్రవేత్తలు చెబుతారు.

2. సుదీర్ఘ తూర్పు తీరం:
శాటిలైట్‌‌ ప్రయోగాలన్నీ సక్సెస్ అవుతాయన్న గ్యారంటీ లేదు. వాతావరణ, సాంకేతిక కారణాలతో నేలకూలిపోవచ్చు. ఆ రాకెట్‌ శకలాలు జనావాలపై కూలితే, ప్రాణనష్టం తప్పదు. అయితే శ్రీహరికోట మాత్రం, ఈ విషయంలో పూర్తి సురక్షితం. ఎందుకంటే, శ్రీహరికోట చుట్టూ నీరే. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు పులికాట్ సరస్సు. ఒకవేళ రాకెట్‌ కూలిపోయినా, జనావాసాలపై పడదు. సముద్రంలో దాని శకలాలు పడిపోతాయి. 43,360 ఎకరాలు శ్రీహరికోట విస్తీర్ణం, సుమారు 50 కి.మీ తీరప్రాంతం, దీని పరిసరాల్లో పెద్దగా జన సంచారంగానీ, ఇళ్లు కానీ లేవు. అందుకే, శ్రీహరికోట,

3. ప్రయోగాలకు అనుకూల వాతావరణం:
ఉపగ్రహ ప్రయోగాలకు, అనుకూల వాతావరణం కూడా అత్యంత కీలకం. ఎండలు ఎక్కువ ఉండకూడదు, వర్షపాతమూ అధికంగా ఉండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే. ఎండలూ, వానలు ఎక్కువుండవు. ఒక్క అక్టోబర్‌, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10నెలలు ప్రయోగాలకు అనుకూలమే.

4. భూమి స్వభావమూ కీలకమే.!
వాతావరణం ఎంత ముఖ్యమో, భూమి స్వభావం కూడా, రాకెట్‌ ప్రయోగాలకు అత్యంత కీలకం. ఎందుకంటే, రాకెట్‌ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి. బండరాళ్లతో బలంగా ఉంటుంది శ్రీహరికోట.
విజువల్స్
5. రవాణా అనుసంధానం

రాకెట్‌ ప్రయోగాలంటే, భారీభారీ యంత్రాలతోనే పని. అధునాతమైన, అత్యంత భారీ పరికరాలే అవసరం. కొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అందుకే రవాణాకు అత్యంత అనుకూలమైన ప్రాంతాల కోసమే అన్వేషిస్తారు శాస్త్రవేత్తలు. ట్రాన్స్‌పోర్ట్‌ టెస్ట్‌లోనూ, శ్రీహరికోటది డిస్టిన్షనే. రోడ్డు, రైలు, జల రవాణా సదుపాయాలున్నాయి. శ్రీహరికోట నేషనల్ హైవే, 5ను ఆనుకుని ఉంది. చెన్నై పోర్టు ఉండేది కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే. రైల్వే స్టేషన్‌ 20 కిలోమీటర్లే.

ఇన్ని ప్రత్యేకతలున్నాయి శ్రీహరికోటకు. దేశంలో రాకెట్‌ ప్రయోగ కేంద్రాల ఏర్పాటుకు, శ్రీహరి కోట ఒక ఛాయిస్ కాదు, ఇండియా ముందు రొమ్మువిరుచుకుని నిలబడ్డ అరుదైన అవకాశం. వాస్తవానికి, మొదట అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు. కానీ శ్రీహరి కోటనే బెస్ట్‌ అయ్యింది. ఇలా అనేక అరుదైన ప్రత్యేకతలున్నందుకే, శ్రీహరి కోట, రాకెట్ ప్రయోగాల కోటయ్యింది. అంతరిక్షంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడేందుకు అస్త్రమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories