నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసింది..

x
Highlights

పాకిస్తాన్‌కు, చైనాకు నిద్రలేకుండా చేస్తున్నదేంటి మరి శత్రు దేశాలకు వార్నింగ్‌ ఇస్తున్న నిఘా నేత్రమేంటది. శ్రీహరి కోట నుంచి నింగికెగిసిన ఆ బాహుబలి...

పాకిస్తాన్‌కు, చైనాకు నిద్రలేకుండా చేస్తున్నదేంటి మరి శత్రు దేశాలకు వార్నింగ్‌ ఇస్తున్న నిఘా నేత్రమేంటది. శ్రీహరి కోట నుంచి నింగికెగిసిన ఆ బాహుబలి ఎవరు? వరుస ప్రయోగాలు, విజయాలతో అంతరిక్ష రహస్యాల చేధనలో దూసుకెళ్తున్న, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, మరో అరుదైన బలగాన్ని, దేశానికి సమకూర్చింది. ఇస్రో తాజాగా చేపట్టిన జీఎస్‌ఎల్వీ ఎఫ్‌ లెవన్‌ను, సక్సెస్‌ఫుల్‌గా కక్ష్యలోకి పంపి బోర్డర్‌కు బూస్ట్‌నిచ్చింది. జీఎస్‌ఎల్వీ ఎఫ్‌ 11 వాహక నౌక.. జీశాట్‌ 7ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లి, భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు. ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేసుకుంటూ, పరస్పరం అభినందనలు చెప్పుకున్నారు.

భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు, ఇస్రోకు అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో మువ్వెన్నెల జెండా రెపరెపలాడిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. అయితే, ఇప్పటికే విజయవంతంగా ఉపగ్రహాలు పంపిన ఇస్రోకు, ఇది కూడా ఒక విజయం కాదు. ఇది అతిగొప్ప విజయాల్లో ఒకటి. ఎందుకంటే, నింగి, నేలా, నీరు, ఇలా నలుదిక్కులా దేశానికి రక్షణగా నిలిచే, భారత సైన్యం, అమ్ముల పొదిలో ఇదొక కీలకమైన అస్త్రం. త్రివిధ దళాలను బలోపేతం చేసిన ఆయుధం. అందుకే జీఎస్‌ఎల్వీ ఎఫ్‌ 11‌ ప్రయోగంపై, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories