వారం క్రితం నవ్వించాడు.. ఇప్పుడు నిర్జీవంగా మారాడు!

వారం క్రితం నవ్వించాడు.. ఇప్పుడు నిర్జీవంగా మారాడు!
x
Highlights

తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్.. కానిస్టేబుల్ సుశీల్ కుమార్ ఇంట్లో అంతులేని విషాదం నింపింది. ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు కూడా...

తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్.. కానిస్టేబుల్ సుశీల్ కుమార్ ఇంట్లో అంతులేని విషాదం నింపింది. ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు కూడా దుర్మరణం పాలయ్యారు. కాకుంటే.. కానిస్టేబుల్ సుశీల్ కుమార్ విషయం.. చాలామందిని కదిలిస్తోంది. వారం క్రితమే ఇంటికి వెళ్లి అందరని ఆప్యాయంగా పలకరించి.. నవ్వించి.. తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన.. ఇప్పుడు ఎదురు కాల్పుల్లో చనిపోవడం.. ఆ కుటుంబానికి అశనిపాతంగా మారింది.

2004 లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైన సుశీల్ కుమార్.. ఈ మధ్యే గ్రౌహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సుశీల్ కు.. రెండేళ్ల కుమార్తె సుశిక కూడా ఉంది. తల్లిదండ్రులకు సుశీల్ ఒక్కడే కుమారుడు.. ఇద్దరు కుమార్తెలు. దీంతో.. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయిన విషయం తెలుసుకుని.. కుటుంబమంతా కుప్పకూలింది.

నిన్న మొన్ననే.. కళ్ల ముందు నుంచి వెళ్లినట్టు కనిపించిన సుశీల్.. ఇప్పుడు శవంగా తిరిగి వస్తున్నాడా.. అంటూ బాధిత కుటుంబం పడుతున్న ఆవేదన.. అందరినీ కదిలిస్తోంది. తండ్రి కోసం ఎదురుచూస్తున్న సుశికను చూసి అంతా ఆవేదన చెందుతున్నారు. సుశీల్ భార్య, కుటుంబసభ్యుల రోదన చూసి కంట తడి పెట్టుకుంటున్నారు. పగవాడికీ ఇలాంటి కష్టం రావొద్దని ప్రార్థిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories