ఏపీకి కొత్త డీజీపీగా గౌతమ్ సవాంగ్?

ఏపీకి కొత్త డీజీపీగా గౌతమ్ సవాంగ్?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఏపీ సర్కారు కొత్త డీజీపీ...

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఏపీ సర్కారు కొత్త డీజీపీ ఎంపికపై సెలక్షన్‌ కమిటీ వేసింది. డీజీపీ రేసులో గౌతమ్‌ సవాంగ్‌, ఆర్పీ ఠాకూర్‌ ముందున్నారు. అయితే గౌతమ్‌ సవాంగ్‌ ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా అయన పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నారు.ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న గౌతమ్‌ సవాంగ్‌ ముక్కుసూటి మనిషని, నిజాయితీపరుడని పేరుంది. గతంలో సవాంగ్‌ ఐక్యరాజ్యసమితిలో నాలుగేళ్లు విధులు నిర్వహించారు. కాల్‌ మనీ కేసులో ఆయన సమర్థవంతంగా పని చేసి మన్ననలు పొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories