logo
సినిమా

అందుకే ఒంగోలు గిత్త ఈ నిర్ణయం తీసుకున్నాడు..

అందుకే ఒంగోలు గిత్త ఈ నిర్ణయం తీసుకున్నాడు..
X
Highlights

గతకొంతకాలంగా సరైనా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మాస్ హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం మంచి హిట్ కోసం ఎదురు...

గతకొంతకాలంగా సరైనా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మాస్ హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం గోపిచంద్ ప్రముఖ రచయిత కె. చక్రవర్తి ద‌ర్శ‌క‌త్వంలో 'పంతం' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గోపిచంద్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం జులై 5 న విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ మూవీ తర్వాత గోపిచంద్ ఓ వెరైటీ లవ్ స్టోరీని చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. దీంతో ఇనాళ్లు యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న ఈ హీరోకి ఏమైంది.. ఎందుకు ఓ లవ్ స్టోరీలో నటించాలనుకుంటున్నాడు అంటూ సినీ పరిశ్రమల్లో కొందరు గుసగుసలాడుకుంటున్నారు. కానీ వాస్తవానికి గోపీచంద్ కు మాస్ హీరో అన్న ఇమేజ్ ఉంది. దీంతో క్లాస్ ప్రేక్షకులను మెప్పించడం కోసమే ఈ ఒంగోలు గిత్త ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Next Story