నిరుద్యోగ భృతి ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. అర్హులు వీరే!

నిరుద్యోగ భృతి ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. అర్హులు వీరే!
x
Highlights

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళా తెలుగుదేశంపార్టీ ఇచ్చిన హామీలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. నిన్న(గురువారం) రాష్ట్ర కేబినెట్ సమావేశంలో...

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళా తెలుగుదేశంపార్టీ ఇచ్చిన హామీలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. నిన్న(గురువారం) రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిరుద్యోగభృతిపై సమాలోచనలు జరిపిన మంత్రులు నిరుద్యోగ భృతిపై విధివిధానాలు ప్రకటించింది. చదువుకుని ఎటువంటి ఉపాధి లేని నిరుద్యోగులకు నెలకు రూ.1000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్‌ ఈ నిర్ణయంపై ప్రకటన చేశారు. సమావేశంలో యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించామని, దాంతోపాటు యువతకు ఉపాధినైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు లోకేష్ వెల్లడించారు.

అర్హులు వీరే..
*దారిద్య్రరేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్నవారు.
* డిగ్రీ, డిప్లొమా చదివినవారు.
* 22 - 35 ఏళ్ల మధ్య వయసువారు.
*ఒక కుటుంబంలో ఎంత మంది అర్హులున్నా అందరికీ చెల్లింపు.
* నెలకు రూ.వేెయి చొప్పున చెల్లింపు.
* నిరుద్యోగ భృతితోపాటు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.
* బయోమెట్రిక్‌ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే నగదు.
* ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి దరఖాస్తుల ఆహ్వానం.
* దరఖాస్తు సమయంలోనే నిరుద్యోగులకు ఆసక్తి ఉన్న నైపుణ్య విభాగాల ఎంపిక.
* ప్రజా సాధికార సర్వే ప్రకారం ఉన్న 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉంటే వారికీ చెల్లింపు.

కాగా భృతి తక్కువని అభిప్రాయం వస్తే రూ.1500కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇదిలావుంటే ప్రభుత్వం ప్రకటించిన భృతి రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుద్యోగులకు స్వల్ప ప్రయోజనం కలగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories