పాలిటిక్స్‌లో గాడ్‌ఫాదర్‌ల కాలమిది!!

పాలిటిక్స్‌లో గాడ్‌ఫాదర్‌ల కాలమిది!!
x
Highlights

ఒక్కో నేతకు ఒక్కో గాడ్ ఫాదర్…ఆ గాడ్ ఫాదర్‌ల ద్వారా అధిష్టానం వద్ద టికెట్ కోసం పైరవీలు..టికెట్ కోసం కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చేందుకు సిద్దమవుతున్న...

ఒక్కో నేతకు ఒక్కో గాడ్ ఫాదర్…ఆ గాడ్ ఫాదర్‌ల ద్వారా అధిష్టానం వద్ద టికెట్ కోసం పైరవీలు..టికెట్ కోసం కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చేందుకు సిద్దమవుతున్న నేతలు. కులం, వర్గం ప్రాతిపదికగా టికెట్ కోసం ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. మొత్తం 11 మంది నేతలు కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. దీనితో టికెట్ కోసం కనివిని ఎరుగని స్థాయిలో టికెట్ కోసం పైరవీలు సాగుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న ఒక్కొక్కరూ, అధిస్థానం వద్ద పలుకుబడి ఉన్న ఒక్కో నేతను గాడ్ ఫాదర్‌గా ఎంచుకుని అభ్యర్థిత్వం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వరగౌడ్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు 2014 ఎన్నికల తర్వాత, కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరారు. వీరి తర్వాత అమీన్‌పూర్ మాజీ సర్పంచ్ కాట శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్, జిన్నారం జడ్పీటిసి ప్రభాకర్‌లు, నియోజకవర్గంలో ప్రధాన కాంగ్రెస్ నాయకులుగా కొనసాగారు. ఆరునెలల క్రితం బీజేపీ నుంచి అంజిరెడ్డి దంపంతులు నాగం జనార్దన్ రెడ్డితో పాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అమీన్పూర్ మాజీ సర్పంచ్ శశికళా యాదవ్ రెడ్డి, టిడిపి నుంచి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరారు. నెలరోజుల క్రితం టీఆర్ఎస్‌ టికెట్ మహిపాల్ రెడ్డికి కేటాయించడాన్ని విబేధిస్తూ, నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్‌ ప్రధాన నాయకులు, గాలి అనిల్ కుమార్, బాల్ రెడ్డి, సపాన్ దేవ్, వడ్డెర రాములు కాంగ్రెస్‌లో చేరారు. వీరంతా టికెట్‌ ఆశిస్తున్నారు.

వీరిలో శశికళా యాదవ్ రెడ్డి, రేవంత్ రెడ్డి ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇక అంజిరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డితో కలిసి బీఫాం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాట శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ద్వారా తన ప్రయత్నాలు చేస్తుండగా, గాలి అనిల్ కుమార్ సైతం దామోదర్,విజయశాంతి ద్వారా టికెట్ వేట కొనసాగిస్తున్నారు. ఇలా ఎవరికి వారు, తమ గాడ్‌ ఫాదర్ల ద్వారా టికెట్ కోసం పైరవీలు చేస్తుండటంతో అసలు టికెట్ ఎవరికి వస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇలా పఠాన్‌చెరు టికెట్‌ ఆశిస్తున్న నేతలందరూ, తమ గాడ్‌ ఫాదర్ల ద్వారా పైరవీలు సాగిస్తున్నారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. గంట గంటకు గాడ్ ఫాదర్‌లకు ఫోన్ చేస్తూ స్టేటస్ అడుగుతున్నారట. దీనితో ఇదెక్కడి గొడవరా బాబు అంటూ ఈ గాడ్ ఫాదర్‌లు తలలు పట్టుకుంటున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories