logo
జాతీయం

పారిక‌ర్ కు బీర్ తాగుతున్న ఫోటోల‌తో యువ‌తుల ట్రోల్

పారిక‌ర్ కు బీర్ తాగుతున్న ఫోటోల‌తో యువ‌తుల ట్రోల్
X
Highlights

వివాద ర‌హితుడిగా పేరున్న గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అమ్మాయిలు మందు తాగే...

వివాద ర‌హితుడిగా పేరున్న గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అమ్మాయిలు మందు తాగే సాంస్క్ర‌తి పెరిగిపోయింద‌ని ఆందోళ వ్య‌క్తం చేశారు. స్టేట్ యూత్ పార్ల‌మెంట్ లో ప్ర‌సంగించిన పారిక‌ర్
గోవాలో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్‌ లేకుండా చేసే వరకు మాఫియాపై దాడులు కొనసాగుతాయని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం కాలేజీల్లో విపరీతంగా ఉందని తాను నమ్మడం లేదని, అయితే పూర్తిగా లేదని మాత్రం చెప్పలేమని అన్నారు. యువత కష్టపడి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వ ఉద్యోగమంటే పని ఉండదని భావిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ సంద‌ర్భంగా ‘అమ్మాయిలు కూడా బీర్లు తాగడం మొదటెట్టారు. అది కూడా పరిమితికి మించి తాగుతున్నారు. వీళ్లను చూస్తే భయమేస్తోంది’ అని పారికర్ వ్యాఖ్యానించారు. అందరూ అలా ఉన్నారని కాదుగానీ, మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య మాత్రం పెరుగుతోంది అని చెప్పుకొచ్చారు. పర్యాటక రాష్ట్రమైన గోవాలో ఆల్కహాల్ అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. విదేశీయుల తాకిడి కూడా ఎక్కువగానే ఉండటంతో తరచూ మద్యం తాగి గొడవలు చేసే ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. పారికర్ ఆందోళనకు కారణం కూడా ఇదే.
అయితే పారిక‌ర్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు అమ్మాయిలు #GirlsWhoDrinkBeer హ్యాష్ ట్యాగ్ ను తాము బీరు తాగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.
బీరు తాగుతున్న అమ్మాయిల్ని చూస్తున్నారే త‌ప్పా .. ఇంకా ఏమేం చేస్తున్నారో తెలియదేమో అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మహిళలు పోర్న్ మూవీస్ చూస్తారని ఒక‌రు ,సిగరెట్లు తాగుతారని మ‌రొక‌రు, ప్రధాని మహిళను చూసి నవ్వుతారు, పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారు, యోగి మహిళలను ఇంటికే పరిమితం చేయాలంటారు... వీరా మన పాలకులు అంటూ సోష‌ల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. పారికర్ కు ఎనిమిది నెలల పాటు రేప్ నకు గురైన అమ్మాయి సంగతి తెలియదా? పరువు హత్యలు కనిపించడం లేదా? పట్టపగలు బస్సుల్లో లైంగిక వేధింపులు తెలియవా? అవన్నీ పారికర్ ను భయపెట్టవా? అని కూడా కామెంట్లు వస్తున్నాయి. ఓ అమ్మాయిగా బీరు తాగడం నాకిష్టం అంటూ చాలా మంది అమ్మాయిలు బీరు తాగుతున్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు.

Next Story