దారుణం..106 మంది రోగులను చంపేసిన నర్సు

Highlights

వైద్యం చేయడంలో విసుగు చెందిన ఓ జర్మనీ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకుంది. ఎవరికి అనుమానం రాకుండా రోగులకు ప్రాణంతక మందులు ఇంజెక్ట్‌ చేసి...

వైద్యం చేయడంలో విసుగు చెందిన ఓ జర్మనీ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకుంది. ఎవరికి అనుమానం రాకుండా రోగులకు ప్రాణంతక మందులు ఇంజెక్ట్‌ చేసి చంపేసేంది. డెల్మెన్‌హోస్ట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్ వైద్యం ముసుగులో హత్యలకు పాల్పడుతుందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్‌ ఎదురైంది. ఆలస్యంగా వెలుగు చూసిన నర్సు నిర్వాకం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

నీల్స్ హోగెల్ 2015లో ఇద్దరి రోగులను హత్య చేయడంతో పాటు మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపిందన్న కేసులో అరెస్ట్‌ అయింది. దీంతో న్యాయస్థానం ఆమెకు జీవిత ఖైదు ఖరారు చేసింది. దీంతో మరికొందరు బాధితులు ఈ కేసు మరోసారి దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో మరోసారి దర్యాప్తు చేసిన పోలీసులు ఈసారి ఆమె మరో 16 మందిని హతమార్చినట్టు గుర్తించారు. ఆమె మొత్తం 106 మందిని హతమార్చిందని నిర్ధారించారు. ఈ హత్యలన్నీ 1999 నుంచి 2005 మధ్యకాలంలో చేసినట్టు తెలిపారు. 2005లో ఒక రోగికి ప్రాణాంతక మందు ఇంజెక్ట్ చేస్తుండగా చూసిన మరోనర్సు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది. వైద్యం అంటే విసుగు చెంది వారందర్నీ చంపేసినట్టు నీల్స్ హోగెల్ ఒప్పుకుంది. విసిగిపోయి 106 మంది రోగులను చంపిన నర్సు

Show Full Article
Print Article
Next Story
More Stories