logo
ఆంధ్రప్రదేశ్

అవసరమైతే పొత్తు వదులుకునేందుకు సిద్ధం: గంటా

అవసరమైతే పొత్తు వదులుకునేందుకు సిద్ధం: గంటా
X
Highlights

రాష్ట్ర ప్రయోజనాల కోసం వీలైతే బీజేపీతో పొత్తును వదులుకుంటామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు...

రాష్ట్ర ప్రయోజనాల కోసం వీలైతే బీజేపీతో పొత్తును వదులుకుంటామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో నిరసనలు చేపట్టామని తెలిపారు. బంద్‌ కారణంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముందుగానే పాఠశాలలకు సెలవు ప్రకటించామని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే భాజపాతో పొత్తు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఎంతటి పొరాటానికైనా సిద్ధమని విలేకరుల సమావేశంలో చెప్పారు.

Next Story