పొన్నం వర్సెస్‌ గంగుల... పాత మిత్రులు.. కొత్త శత్రువులు

పొన్నం వర్సెస్‌ గంగుల... పాత మిత్రులు.. కొత్త శత్రువులు
x
Highlights

ఒకప్పటి స్నేహితులే ఇప్పుడు ప్రత్యర్దులయ్యారు. నిన్నామొన్నటి వరకు లేని వ్యక్తిగత విమర్శలు ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు మొదలయ్యాయి. ఆ లొల్లి ఏకంగా...

ఒకప్పటి స్నేహితులే ఇప్పుడు ప్రత్యర్దులయ్యారు. నిన్నామొన్నటి వరకు లేని వ్యక్తిగత విమర్శలు ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు మొదలయ్యాయి. ఆ లొల్లి ఏకంగా పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. కరీంనగర్ నియోజకవర్గంలో ఇద్దరు స్నేహితుల మధ్య కొనసాగుతుంది. కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు వేడిక్కిపోతుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తర పోటీ నడుస్తోంది. టీఆర్ఎస్‌ బీజేపీ... ఇప్పటికే అభ్యర్దులను ప్రకటించగా.. ఇటు కాంగ్రెస్ నుంచి మాత్రం పొన్నం ప్రభాకర్ బరిలో ఉండేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఉన్న ఇతర ఆశావాహులు కూడా పొన్నంకే టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి చెప్పయడంతో పొన్నం పోటి దాదాపు ఖాయమేనంటున్నారు కార్యకర్తలు. ఈపాటికే ప్రచారం ప్రారంభించిన పొన్నం కరీంనగర్‌లోని పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు. గతంలో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ఇప్పుడు అసెంబ్లీ బరిలో దిగడంతో రాజకీయం పోటాపోటీగా ఉంటుందనే అభిప్రాయం వినడుతుంది.

పొన్నం ప్రభాకర్... గంగుల కమలకార్.. ఇద్దరు ఒకప్పుడు స్నేహితులు. ఒకే విద్యాసంస్థలో చదువుకున్న వ్యక్తులు. ఇద్దరు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నప్పటికీ ఎప్పుడు గతంలో వ్యక్తిగత విమర్శలకు పోలేదు. ఇప్పుడు గుంగలకు పోటీగా పొన్నం దిగడంతో స్నేహితుల మధ్య పోటీ పెరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగానే పొన్నంకు పలు చోట్ల టీఆర్్ఎస్‌ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురవుతూ వస్తోంది. ప్రచారన్ని ప్రారంభించి ఇటీవల కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ కూడా పలువురు మహిళలు కూడా పొన్నం నిలదీశారు.. ఇక దుర్శేడు, చేగూర్తి గ్రామాలకు ఇటీవల వెళ్లిన పొన్నంను స్థానిక టీఆర్ఎస్‌ కార్యకర్తలతో పాటు, మహిళలు అడ్డుకున్నారు. ఇలా ప్రచారానికి వెళ్లిన ప్రతీచోట పొన్నం ప్రభాకర్‌కు ఏదో ఇబ్బంది ఎదరువుతూ వస్తోంది.

ఈ ఘటనల వెనక టీఆర్ఎస్‌ అభ్యర్థి గంగుల కమాలకర్ ఉన్నారంటూ పొన్నం విమర్శలకు దిగారు. దీంతో ఎన్నికల వేళ స్నేహం కూడా పక్కన పెట్టి చూసుకుందాం అంటూ బహిరంగంగానే స్టేమెంట్ ఇచ్చేశారు పొన్నం. అంతేకాదు టీఆర్ఎస్‌ కార్యకర్తలపై కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. టీఆర్ఎస్‌ ప్రతిచోట కావాలనే అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇలా రోజురోజుకి కరీంనగర్ నియోజకవర్గ రాజకీయాల్లో వేడి పెరిగిపోతుండటంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు స్నేహితులైన గంగుల, పొన్నం మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుండటంతో మరింతగా చర్చగా మారింది. రెండు మూడు ఘటనలు ఇలానే వరుసగా జరగడంతో పొన్నం కూడా టీఆర్ఎస్‌పై డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. గులాబీ కౌంటర్‌ ఎలా ఉంటుందోనని వైరిపక్షాలు ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైన ఇద్దరు స్నేహితుల మధ్య కొనసాగుతున్న రాజకీయంతో కరీంనగర్ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories