logo
జాతీయం

బెంగళూరు పోలీసులకు లొంగిపోయిన గాలి జనార్దన్ రెడ్డి

బెంగళూరు పోలీసులకు లొంగిపోయిన గాలి జనార్దన్ రెడ్డి
X
Highlights

బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి అజ్ఞాతం వీడారు. బెంగళూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కి వెళ్లి...

బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి అజ్ఞాతం వీడారు. బెంగళూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కి వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను పరారీలో లేనన్నారు. తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు. జనార్దన రెడ్డి తనతో పాటు న్యాయవాదులను కూడా తీసుకొచ్చారు. అంబిడెంట్‌ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలిని పోలీసులు విచారించనున్నారు. అంబిడెంట్‌ స్కామ్‌లో ఈడీ అధికారికి గాలి జనార్దన్‌రెడ్డి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడీ రైడ్స్‌ నుంచి అంబిడెంట్‌ కంపెనీని రక్షించేందుకు భారీ డీల్‌ కుదుర్చుకున్న గాలి.... 57 కిలోల గోల్డ్‌తోపాటు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.

Next Story