ఖద్దర్‌ వేసుకుంటా... ఖబడ్దార్‌ అంటున్న గద్దర్

ఖద్దర్‌ వేసుకుంటా... ఖబడ్దార్‌ అంటున్న గద్దర్
x
Highlights

ప్రజా గాయకుడు గద్దర్ యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గద్దర్...

ప్రజా గాయకుడు గద్దర్ యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగినా...అది అబద్ధమని ఆయన తేల్చి చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్‌ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. భార్య, కుమారుడితో సహా రాహుల్‌‌ని కలిశారు. కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, కొప్పుల రాజుతో పాటు రాహుల్‌తో సమావేశమయ్యారు. తర్వాత కొద్దిసేపటికే యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాతో కూడా గద్దర్ కుటుంబం భేటీ అయ్యింది. గద్దర్ కుమారుడు సూర్యకిరణ్‌ కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా..తాజాగా గద్దర్ రాహుల్ ‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది.

గద్దర్ ఢిల్లీ బాట పట్టిన వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రాహుల్‌తో భేటీ తర్వాత గద్దర్ తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని తేల్చి చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాహుల్‌ కోరినట్లు గద్దర్‌ వివరించారు. తెలంగాణ ఇచ్చిన ప్రయోజనాలు నెరవేరలేదని సోనియాకు వివరించినట్లు తెలిపారు. అయితే మహాకూటమికి అనుకూలంగా ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను గద్దర్‌‌కు అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే తన కుమారుడు సూర్యకిరణ్‌కు బెల్లంపల్లి సీటు గురించి కేటాయించడంతో పాటు మరో ఇద్దరు అనుచరులకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గద్దర్‌ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories